User:TKPS/sandbox

From Wikipedia, the free encyclopedia

బుల్లెట్ పాయింట్స్(లఘు ప్రక్రియ) వికీపీడియా:

బుల్లెట్ పాయింట్స్ అనునది రెండు పాదాలు కలిగిన నూతన లఘు కవితా ప్రక్రియ. దీనిని వరంగల్ అర్బన్ జిల్లా భీమారం రామారం కు చెందిన ఆంగ్ల ఉపాధ్యాయిని తాడూరి కపిల(కపిల శ్రీనివాస్) రూపొందించారు.తాడూరి కపిల గారు ఇంతకుముందు నిజాలు అనే లఘు కవితా ప్రక్రియను కూడా రూపొందించి ఉన్నారు. అది నాలుగు పాదాలు గల మాత్రాఛందస్సు తో కూడిన ప్రక్రియ. అయితే మరింత సరళమైన చందస్సు లేని చిన్న ప్రక్రియను రూపొందిస్తే ప్రక్రియ సులభతరంగా సూక్ష్మంలో మోక్షం అన్నట్టు ఉంటుందని అందరినీ ఆకట్టుకుంటుందని భావించి జూన్ 14,2021 తేదీన అనుకున్నదే తడవుగా ఆలోచించి బుల్లెట్ పాయింట్స్ అనే నూతన ప్రక్రియను రూపొందించడం జరిగింది. ప్రక్రియ ప్రారంభించిన ఒకటి రెండు రోజుల్లోనే విశేష ఆదరణ పొందింది. పలు సమూహంలో నుండి సాహితీప్రియులు ఈ ప్రక్రియ గూర్చి తెలుసుకోవడానికి ఉత్సాహం చూపారు. రెండవ రోజున ఒక సమూహం లోని దాదాపు 30 మంది ఈ ప్రక్రియలో రచనలు చేశారు. ఈ ప్రక్రియలోని రచనలు వార్తా పత్రికలలో కూడా ప్రచురించబడడం జరిగింది. కొంతమంది కవులు రాసిన బుల్లెట్ పాయింట్స్ కొన్ని వెబ్ సైట్ లలో కూడా ప్రచురించబడ్డాయి. కేవలం పది పదిహేను రోజుల్లోనే ఈ ప్రక్రియ విశేషంగా సాహితీ ప్రియులను ఆకట్టుకుంది.

☀నామకరణం:

 ********

కవిత చదవగానే అంశం చదువరుల మదిలోకి బుల్లెట్ లాగా దూసుకెళ్లే విధంగా ఉండాలి మరియు కంప్యూటర్ పరిభాషలో ముఖ్యమైన అంశాలకు ముందు వాడే చిహ్నాలను బుల్లెట్స్ అంటారు. అంటే ఇవి అతి ముఖ్యమైనవి అన్నమాట. అందుకే ఈ ప్రక్రియకు బుల్లెట్ పాయింట్స్ అని నామకరణం చేయడం జరిగింది.

🟡 బుల్లెట్ పాయింట్స్ నియమాలు:

🟡 ఇది రెండు పాదాలతో కూడిన ప్రక్రియ.

🟠 ప్రతి వాక్యంలోనూ రెండు పదాలు లేదా

  పదబంధాలు  కొన్ని సందర్భాలలో ఒకే పదబంధం 
  కూడా ఉండవచ్చు.

🟢 రెండు పాదాలకు ప్రాస కుదరాలి.

🟣 చదువరులకు ఇది ఒక ముఖ్యమైన బుల్లెట్

  పాయింట్ లాగా మదిలోకి దూసుకెళ్లాలి.


☀ ఉదాహరణలు

👉 అక్షరమే ఆయుధం!

  సంస్కరించు సాధనం!

👉 మతమన్నది మార్గము!

  ఒకటేగా గమ్యము!

👉 రగులుతున్న సూర్యుడు!

  విప్లవానికి ఆద్యుడు!

👉 అడ్డదారి ప్రయాణం!

  కాకూడదు ప్రమాణం!

👉 పసిపిల్లల మనస్సు!

  చక్కని ఇంద్రధనస్సు!

👉 తడబడనీయకు అడుగు!

  పడుతున్నా పిడుగు!

👉 కోరికల గుర్రాలను!

  కళ్లెమేసి ఆపవలెను!

👉 తీరుతుంది ఆయువు!

  తగ్గితే ప్రాణవాయువు!

👉 దైవాన్ని స్మరించు!

  దివ్యంగా జీవించు